ఇది మామూలు క్రేజ్ కాదు..
హైదరాబాద్, ఆంధ్ర్రప్రభ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో కలిగే క్రేజ్(the craze) వర్ణనాతీతం. ప్రస్తుతం ఆయన నటిస్తున్నయాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (Original Gangster) విడుదలకు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో టాలీవుడ్‌లో హంగామా మొదలైంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నఈ చిత్రంపై హైప్ తారాస్థాయిలో కొనసాగుతోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకముందే టికెట్ల కోసం అభిమానులు రికార్డు స్థాయి డిమాండ్(demand) సృష్టిస్తున్నారు. ముఖ్యంగా టికెట్ వేలం పాటలు విపరీతమైన చర్చనీయాంశంగా మారాయి.
నిజాం ప్రాంతంలో తొలి టికెట్(ticket)ను టీమ్ పవన్ కల్యాణ్ నార్త్ అమెరికా ఏకంగా రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది. కూకట్‌పల్లి(Kukatpally)లోని విశ్వనాథ్ 70mm థియేటర్‌లో మొదటి టికెట్ రూ.1,12,000కి అమ్ముడైంది. అదే థియేటర్(Theater)లో మరో ఇద్దరు అభిమానులు వరుసగా రూ.23,111, రూ.18,100కి టికెట్లు దక్కించుకున్నారు.
ఇక, తాజాగా చిత్తూరు( Chittoor) జిల్లాకు చెందిన ఒక అభిమాని తన అభిమానాన్నివినూత్నంగా ప్రదర్శించాడు. రాబోయే ఓజీ (Original Gangster) చిత్రానికి సంబంధించిన మొదటి టికెట్‌ను ఒక లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే థియేటర్ నిర్వాహకులు.. ఈ మొత్తాన్నివృథా చేయకుండా సమాజహిత(Samajhita) దిశగా మలిచేందుకు ముందుకొచ్చింది. ఆ అభిమాని చెల్లించిన మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి నిమిత్తం జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా పంపాలని నిర్ణయించింది. అభిమానుల ఉత్సాహాన్ని సమాజ సేవకు మలచిన ఈ నిర్ణయం సోషల్ మీడియాలో(on social media) విస్తృతంగా వైరల్ అవుతూ ప్రశంసలు పొందుతోంది.
ఈ రికార్డు స్థాయి టికెట్ బిడ్డింగ్(ticket bidding) ఓజీపై అభిమానుల్లో ఉన్నఅపారమైన క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఈ చిత్రం ఒకటిగా నిలిచిపోయింది.
సినిమా విషయానికొస్తే…. సాహో ఫేమ్ సుజీత్(Saaho Fame Sujeeth) దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, సంగీతాన్నిఎస్.ఎస్. తమన్ అందించారు. ఈ ప్రాజెక్ట్(Project)పై అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాల్లోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

