ఈ దీపావళికి.. ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: దీపావళి సందర్భంగా స్నేహితులందరికీ బాదం పప్పును కానుకగా ఇవ్వాలంటూ కాలిఫోర్నియా ఆల్మండ్స్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ పేరుతో రూపొందించిన ఈ ప్రచారం.. సాధారణంగా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులకే పరిమితమయ్యే పండుగ కానుకల జాబితాను స్నేహితుల వరకు విస్తరించాలనే సందేశాన్ని ఇస్తోంది. కార్యాలయ స్నేహితులు, జిమ్ మిత్రులు, ప్రయాణాల్లో పరిచయమైన వారు, కాఫీ స్నేహితులు.. ఇలా తమ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రతి ఒక్కరినీ దీపావళి వేడుకల్లో భాగం చేసుకోవాలని సూచిస్తోంది.
యువతరం ఉద్యోగాలు, కొత్త నగరాలు, కొత్త స్నేహ బంధాలతో తమ జీవితాలను నిర్మించుకుంటున్న నేపథ్యంలో పండుగ కానుకల విషయంలోనూ మార్పు వస్తోందని కాలిఫోర్నియా ఆల్మండ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సంప్రదాయంగా దీపావళి కానుకల్లో భాగమైన బాదం పప్పును కొత్త తరానికి అనుగుణంగా పరిచయం చేయడమే ప్రచారం ఉద్దేశమని తెలిపింది. స్నేహానికి ప్రాధాన్యమిస్తూ రూపొందించిన సంగీత ప్రధానమైన ప్రచార చిత్రంలో పార్టీ బడ్డీ, ట్రావెల్ బడ్డీ, కూల్ ఆంటీ వంటి విభిన్న పాత్రలను చూపించారు. పండుగ వాతావరణం, సంగీతం, స్నేహబంధాల నేపథ్యంలో తమ కాంటాక్ట్ లిస్ట్‌ను మరోసారి చూసుకుని తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను గుర్తుచేసుకోవాలని ప్రచారం సూచిస్తోంది.
ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఇండియా మార్కెట్ లీడ్ మణి పాంధర్ మాట్లాడుతూ.. భారతదేశంలో తరతరాలుగా దీపావళి కానుకల్లో బాదం పప్పు ఒక భాగంగా ఉందన్నారు. అయితే కొత్త తరం సంబంధాలను ఏర్పరుచుకునే విధానం, పండుగలను జరుపుకునే తీరు మారుతున్న నేపథ్యంలో ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ద్వారా ఈ సంప్రదాయాన్ని కొత్త తరంతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. పండుగ సీజన్‌కే పరిమితం కాకుండా బాదం పప్పును రోజువారీ జీవితంలోనూ భాగం చేయాలన్నది ప్రచారం లక్ష్యమని పేర్కొన్నారు.
దీపావళి కానుకగా బాదం పప్పు ఆప్యాయత, ఆరోగ్యం, శ్రేయస్సుతో ముడిపడిన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ప్రచార వీడియో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉందని పేర్కొంది. మరింత సమాచారం కోసం సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది.
