వారు మంచిని నేర్చుకుంటారు

వారు మంచిని నేర్చుకుంటారు
సుభాషితం అనగా మంచిమాట. రెండువేల సంవత్సరాల క్రితం భర్తృహరి(Bhartruhari) అన్నమాటలు అక్షరసత్యాలు. జీర్ణమంగే సుభాషితమ్.. నేను చెప్పే మంచి మాటలు వినేవారు ఎవరు? అందుకే అవి నాలోనే జీర్ణమయిపోతున్నాయి(being digested) అని బాధపడ్డాడు.
సుభాషితం ఎవరికేం చెప్పి లాభం లేదు. పండితులు అసలు వినరు. వారికి గర్వం ఆభరణంగా(ornamental) ఉంటుంది. సర్వం మాకే తెలుసు అనుకుంటారు. పైగా వారు లేనిపోని విమర్శలు(unfailing criticism) చేసి నిరాశ పరుస్తారు. కొందరైతే అసూయతో సత్యానికి లేని పోనివి ఆపాదించి అసత్యంగా మారుస్తారు. ఇక పరిపాలకులకు గర్వంతో పాటు దర్పం కూడా ఉంటుంది. అందరూ చెప్పే విషయాలకు తలూపితే చులకనై పోతాము అని భావిస్తారు. కావున అంత త్వరగా చెప్పేది వినరు.
ఇక సామాన్య ప్రజలకు చెప్పి బాగుచేద్దామనుకుంటే వారికి జీవన పోరాటం(struggle for life)లో అసలు సమయమే దక్కదు. పైగా బోధనలు వినే స్థాయిలో వారి మనసు ఉండదు. పేదరికం వల్ల కనీస అవసరాలు తీర్చుకునేందుకే వారి ఆలోచనలు పరిమితమయిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే వారు అజ్ఞానంలోనే( in ignorance.) మ్రగ్గిపోతారు.అందుకే వారు అసత్య బోధకుల వంచనకు గురవుతూ ఉంటారు
ఈ సమస్య నేటికీ కొనసాగుతోంది. అది వేరొక రకంగా పని చేస్తోంది. పెద్ద వాళ్ళు వారి వారి అనుభవంతో చెప్పే మంచిమాటలను వినేవారు కరువవుతున్నారు. ఒక మూల కూర్చొని కృష్ణా!రామా!(Krishna!Rama!) అనుకోవచ్చు కదా అని సెలవిస్తున్నారు.
మిడిమిడి శాస్ర్తజ్ఞానంతో అవసరమైన సామాజిక శాస్ర్త సూత్రాలను పెడచెవిన పెడుతున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఏది సరైనదో? కాదో? పెద్ద ప్రశ్నార్థకమై పోయింది. గూగుల్ తల్లి వచ్చిన తరువాత అనుభవజ్ఞులైన(experienced) తల్లుల సలహాలు వెలవెలబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక అతిపెద్ద రహస్యం(supreme secret) ఏమిటంటే సలహాల శాస్ర్త విజ్ఞానం అమితంగా పెరిగిపోయింది. ఏది అనుసరించాలో తెలియని అయోమయ పరిస్థితి. పెద్దల మాట చద్దన్నం మూట! అనే సామెత చెబితే చద్దన్నమా! చాల్లే ఊరుకో అని బటర్, బ్రెడ్, పిజ్జా, మొమోలు పెడతారు.
ప్రస్తుతం బయట తిళ్ళు తిని యువత ఆరోగ్యాలు ఎలా పాడుచేసుకుంటున్నారో వార్తల్లో చూస్తున్నాము. కాబట్టి అనుభవాన్ని మించిన గురువు లేరు. అందుకే పెద్దలు చెప్పే మంచిమాటలు తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే వారిది అనుభవంతో కూడిన మాట. వాస్తవానికి అసలైన సుభాషితం మనసును ఖచ్చితంగా(surely) కదిలిస్తుంది. ఆ సమయంలో కొంత వివేకంతో అనుసరిస్తే అది ఖచ్చితంగా జీవితంలో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
అందుకే మన పాఠశాలల్లో నీతి పద్యాలు, సుభాషితాలు, పంచతంత్ర కథలు(Panchatantra stories), పరిసరాలలోనున్న ప్రకృతిసిద్ధ వృక్షాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొదలైనవి తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఆసక్తిగా బోధించాలి. ప్రవచనాల హోరు మీడియాలో మార్ర్మోగుతోంది. అంతర్యామిలు, మంచిమాటలు, చింతనలు, భక్తి పత్రికలు తామర తుంపరగా వస్తూనే ఉన్నాయి.
అయినా సమాజంలో నేరాలు, ఘోరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం(the main thing) మనమంతా గమనించాలి. పై సుభాషిత అంశాలు వస్తున్నాయి కనుకనే సమాజంలో ధర్మపాదం యొక్క ముద్ర పడి అవి అదుపులో ఉంటున్నాయి. ఏ యుగంలోనైనా సురాసురులు ఉంటారు. అసురుల ఆటలు కట్టించాలంటే సుభాషితాలు ప్రచారంలో తప్పనిసరిగా ఉండాలి.
బోధించేవారు ఫలోపేక్ష రహితంగా తమ బాధ్యత వారు నిర్వర్తించాలి. ధర్మం తన పని తాను ఎప్పుడూ చేస్తుంది. నేటికీ భర్తృహరిని మనం గుర్తుంచుకున్నామంటే వారి సుభాషితాలు పనిచేస్తున్నట్లే(Working) కదా! కాబట్టి మంచిమాటలు ఎప్పుడూ ప్రజల మనసును తాకుతాయి. అంతర్గతంగా వాటి ప్రబావం చూపిస్తూనే ఉంటాయి. అందుకే మంచిమాట పలకడమే కాదు వాటిని అనుసరించడం ముఖ్యం.
— వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు–
