వీరి పాత్రే కీలకం..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ప్రతి దేశ ప్రధానీ కచ్చితంగా ప్రపంచ దేశాలల్లో పర్యటించాలి… అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకోవాలి. అప్పుడే వ్యాపార వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందుతాయి. విదేశీమారక(foreign exchange) నిల్వలు పెరుగుతాయి. అందుకే ఏ దేశాధ్యక్షుడి(President)కైనా దేశాల పర్యటనలు అత్యంత కీలకమైనవి. సాధరణంగా ఇలాంటి సందర్భాల్లో ఇరుదేశాల రాయబారుల ద్వారా, పీఎంవోల ద్వారా ప్రోగ్రాంస్ ఫిక్స్(Meeting Programs Fix) అయిపోతాయి.

దేశాధ్యక్షులు ఏం మాట్లాడుకోవాలి? ఏం చర్చించాలనేదానిపై ఒక అవగాహన జరిగిపోతుంది. అయితే ముందుగానే ఎన్ని విషయాలు ప్లాన్ చేసుకున్నా, ఆయా దేశాధ్యక్షులు కలుసుకున్నప్పుడు కొన్నివిషయాలైనా ముఖాముఖి మాట్లాడుకోవాలి కదా. ఏ దేశ ప్రధాని/అధ్యక్షుడికీ మూడు, నాలుగు మించి భాషలు తెలియక పోవచ్చు. తాము కలుసుకున్న దేశాధ్యక్షుడి భాష తమకు తెలియకపోవచ్చు.

అలాంటి సమయాల్లోనే కీలకంగా మారే ప్రొఫెషనల్స్….ట్రాన్స్ లేటర్స్…దేశాధ్య‌క్షుల‌కు ట్రాన్స్‌లేట‌ర్లు నియమితులై ఉంటార‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు. వారు ఆయా దేశాలకు సంబంధించిన వివిధ భాష‌ల్లో వీరు నిపుణులై ఉంటారు. ఎక్కువ శాతం ప్రొఫెస‌ర్లు, బహుభాషా కోవిదులు ఈ పోస్టుల్లో నియ‌మిమింపబడతారు.

వీరికి తమ ప్రధాని సంభాషించబోయే అధ్యక్షుడి దేశభాస పట్ల క్షుణ్ణంగా అవగాహన, మంచి పట్టు ఉంటుంది. ఇలాంటి నిష్ణాతులైన ట్రాన్స్‌లేట‌ర్లు (Expert Translators) ఉన్న‌ప్పుడే ఇరు దేశాధ్య‌క్షులు స‌మావేశ‌మైన‌ప్పుడు ఎలాంటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది.

రెండు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు క‌లిగి ఉండాలంటే.. ఆ దేశాల అధ్య‌క్షులు, వారి పాలన, వ్యవహారశైలి కీల‌కం. ఇరు దేశాలు ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకునేట‌ప్పుడు అనువాదకుల వల్ల ఎలాంటి పొర‌పాటు జ‌రిగినా ఇరు దేశాల మ‌ధ్య బాండింగ్‌(Bonding)కు అస‌లుకే మోసం వ‌స్తుంది. చిన్న త‌ప్పిదంతో ఎన్నో అన‌ర్థాల‌కు దారి తీసే అవ‌కాశం ఉంది.

ఈ స‌మ‌యంలో ట్రాన్స్‌లేట‌ర్లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దేశాధ్య‌క్షుల అభిప్రాయాల‌ను తూచా త‌ప్ప‌కుండా వివ‌రించ‌డంలో వీరు ప్ర‌ధానంగా వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ వీరికి అన్ని రంగాల్లో విష‌య ప‌రిజ్ఞానం చాలా ఉంటుంది. భాష మీద‌నే కాకుండా దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి వీరు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

ఒక్కొక్క సారి వీరి పదాల్లో ఏ చిన్న పొర‌పాటు దొర్లినా, ఇరుదేశాల మధ్యా(Between the Two Countries) తీవ్రమైన అపార్థాలకు దారి తీస్తుంది. అందుకే వీరు దేశాధ్యక్షుల మాటలను చాలా జాగ్రత్తగా విని, అనువదించి, వేరొక అధ్యక్షుడి భాషలో వివరిస్తారు.ఇలాంటి భేటీ(Meeting)ల్లో అనువాదకుల పాత్ర కీలకమైంది.

Leave a Reply