పచారీ షాపులో చోరీ..!
- కృష్ణాజిల్లా కోడూరులో కలకలం
( ఆంధ్రప్రభ, కోడూరు) కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం రోడ్డు(Gollapalem Road)లో శుక్రవారం రాత్రి పచారీ దుకాణంలో చోరీ కలకలం రేపింది. గొల్లపాలెం రోడ్డులోని సాయి లక్ష్మీ జనరల్ స్టోర్స్(Sai Lakshmi General Stores) (పచారీ షాపు) తాళం పగల కొట్టి దొంగలు(Thieves) నగదు అపహరించినట్లు షాపు యజమాని చామర్తి శ్రీనివాసరావు(Chamarthi Srinivasa Rao) తెలిపారు. గల్లా పెట్టెలోని రూ.9 వేల నగదు దొంగలించారన్నారు. ఈ పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు..