పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్


జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 4 (ఆంధ్రప్రభ ): పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షల 70 వేల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ… పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయికల్ ఏఎంసీ చైర్మన్ రవీందర్ రావు, సర్పంచులు ప్రసాద్, ఆకుల మల్లేశం, నీరటి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

రూ.2.50 లక్షల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే
జగిత్యాల టౌన్, నవంబర్ 4 (ఆంధ్రప్రభ ): జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మండల దేవయ్య మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2 లక్షల 50 వేల ఎల్ఓసీ మంజూరు చేయించారు. బుధవారం జగిత్యాల క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేశారు. ఎల్ఓసీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.