రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
రైతుల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు.

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికిరూ. 2461, సాధారణ రకానికిరూ.2441 చెల్లించడంతోపాటు సన్న రకానికి అదనంగా 500బోనస్ చెల్లిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డిపిఎంమాసన్న, ఏపీఎం హరి నారాయణ మండల సమైక్య అధ్యక్షురాలు శివలీల, సీసీ విజయ్ పంచాయతీ కార్యదర్శి మాధురికా, ఏ ఈ ఓ స్వప్న గ్రామ సంఘం అధ్యక్షురాలు రాధా, తదితరులు పాల్గొన్నారు.