640 అడుగులకు చేరిన మూసీనది నీటిమట్టం..

ఇంకా నదిలో చేరుతున్న 2158 క్యూసెక్కులు
షెడ్యూల్ కంటే ముందే నీటి విడుదల – ఆయకట్టు రైతుల హర్షం


సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఎగువన విస్తారంగా కురిసిన వర్షాలకు మూసినదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కాగా ప్రస్తుతం నది నీటిమట్టం 645 అడుగులకు చేరింది. బుధవారం ఉదయం నాటికి ఇంకా 2158 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతుంది. ఖరీఫ్ పంటలకు నీటి విడుదల చేస్తుండడంతో ఈనెల 12 వరకు నది నీటిమట్టం 636 అడుగులకు చేరగా అనూహ్యంగా పడ్డ వర్షాలకు నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరి ప్రస్తుతం 640 అడుగులకు చేరింది.

షెడ్యూల్ కంటే ముందే నీటి విడుదల- ఆయకట్టు రైతుల హర్షం

మూసి ఆయకట్టు రైతులకు పంటలు పండించేందుకు ప్రాజెక్టు అధికారులు షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల చేస్తున్నారు మొదటి విడత జూలై 16న రెండో విడత ఆగస్టు 20న విడుదల చేశారు మూడో విడత సెప్టెంబర్ 19న విడుదల చేయాల్సి ఉండగా భారీగా నదిలో నీరు వచ్చి చేరడంతో షెడ్యూల్ కంటే ముందే సెప్టెంబర్ 14 నుండి కుడి ఎడమ కాలువలకు 220 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వెళ్లారు కరెంటు కోతలతో బోరు బావుల ద్వారా పంటలకు సరిపడా నీరు అందకపోవడంతో రైతులు ఆవేదనతో సబ్ స్టేషన్ల ముందు నిరసన చేస్తున్న క్రమంలో అనూహ్యంగా మూసి నది నుండి నీరు రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.