గ్రామమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు

  • ఫుట్ బాల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధికి భరోసా కల్పిస్తా
  • రాయపర్తి గ్రామపంచాయతీ స్వసంత్ర అభ్యర్థి గారె సహేంద్ర – బిక్షపతి

రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్రామమే దేవాలయం అని ప్రజలే దేవుళ్ళని.. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫుట్ బాల్ గుర్తుకు ఓటెయ్యాలని రాయపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి గారె సహేంద్ర – బిక్షపతి గ్రామ ప్రజలను వేడుకున్నారు. ఈ రోజు రాయపర్తి గ్రామంలో చేపట్టిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో ఫుట్ బాల్ గుర్తు దూసుకుపోతుంది.

గ్రామంలో గడపగడపకు ప్రచారం చేస్తూ ప్రచారంలో ముందుంటున్నారు. ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ కష్టం విలువ తెలుసని, ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి గ్రామస్తుల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నానని.. ఆశీర్వదించి గెలిపిస్తే ఒక సేవకుడిగా పని చేస్తానని.. అభివృద్ధికి ముందుంటానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు.

ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఫుట్ బాల్ గుర్తుకు ఓటెయ్యాలని వారు కోరారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటేస్తే, ఐదేళ్లు బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తామని వారు తెలిపారు. పాలకునిగా కాకుండా, గ్రామానికి పెద్ద జీతగానిగా అందరికీ అందుబాటులో ఉంటానని ఆశీర్వదించాలని వారు కోరారు.

ఆపదలో ఉన్న వారికి సేవ చేయడం, అభాగ్యులకు అండగా నిలవడం బిక్షపతి నైజం అని ప్రజలు తెలుపుతున్నారు. వారు చేసిన సేవా, అతని తమ్ముళ్లు, అల్లుళ్లు ప్రజలకు వైద్య సేవలు అందించడం విజయానికి కారకాలుగా ఉపయోగపడుతున్నాయని ప్రజలంతా విశ్వసిస్తున్నారు. కచ్చితంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటు అందరి ఆదరాభిమానాలు తనపై ఉంచాలని కోరుకుంటూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.

Leave a Reply