దాతల సహకారం అభినందనీయం

ఎంపీవో హరీఫ్
తొర్రూర్ రూరల్, ఆంధ్రఫ్రభ :
గ్రామాభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఎంపీఓ హరీఫ్ అన్నారు. మండలంలోని కిష్టాపురం గ్రామ పంచాయతీకి దాతలు నకిరకంటి ముత్తయ్య, నకిరకంటి వెంకన్న, నకిరకంటి రాములు సహకారంతో సుమారు రూ.25 వేల విలువైన బీరువా, టేబుల్, కుర్చీలను శనివారం గ్రామ పంచాయతీకి బహుకరించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నకిరకంటి మాధవి సంపత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఎంపీఓ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిపాలనకు అవసరమైన సదుపాయాల కల్పనలో దాతల పాత్ర అభినందనీయమ‌న్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. జీపీ భవనం నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వడానికి ఇస్సంపల్లి అంజయ్య ముందుకు రావడం హర్షణీయం కొనియాడారు. అనంతరం గ్రామ పంచాయతీకి ఫర్నిచర్ అందించిన దాతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శోభ, ఉపసర్పంచ్ నకిరకంటి సుజాత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.