ఆదివాసీలకు అవస్థలే అవస్థలు

  • భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ఆంధ్రప్రభ, చింతూరు (ఏఎస్ఆర్ జిల్లా) : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చింతూరు ఏజేన్సీ ఎగువ ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఆ వర్షాల వరద నీరు చింతూరు మన్యంలోని శబరి, గోదావరి నదుల్లో కలసి క్రమేపీ నెమ్మదిగా పెరుగుతున్నాయి.

ఇప్పటీకే ఈ రెండు నదులు వరద నీటి నిండుకుండలా ప్రవహిస్తుండుగా మళ్ళీ వర్షాలతో మన్యంలో మారుమారు వరద భయం నెలకొంది. భద్రాచలం వద్ద గోదావరి నది మెల్లగా పెరుగుతూ శుక్రవారం మధ్యహ్నాం 1 గంట సమయానికి 43.20 అడుగులకు చేరుకొని ప్రవహిస్తుండుగా అధికారులు మొదటీ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఇది ఇలా ఉంటే చింతూరులోని శబరి నది సైతం నెమ్మదిగా పెరుగుతుంది. శబరి ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో శబరి నదిలోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది.

వాగులు వంకలు పరవళ్లు

చింతూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని శబరి, గోదావరి నదులు పెరగడంతో ఆ నదులకు అనుసంధానమైన వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఆ వరద రహదారులపై చేరుతున్నాయి. ఈ నేపధ్యంలో చింతూరు మండలంలోని సోకిలేరు, కుయుగూరు, అత్తకోడల్లు, చంద్రవంక వాగులు వరదతో నిండుకుంటున్నాయి.

ఈ క్రమంలో చింతూరు – విఆర్‌ పురం ప్రధాన రహదారిపై చుటూరు – ముకునూరు గ్రామాల మధ్య ఉన్నటువంటి సోకిలేరు వాగు ప్రధాన రహదారిపై చేరింది. ఈ రోజు సాయంకాలనికి రాకపోకలు నిలిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రహదారిపై చేరడంతో ఆ వరద నీటిలోనే ప్రజలు రాకపోకలు కోనసాగిస్తున్నారు. అదే విధంగా వీఆర్‌ పురం మండలంలోని చింతరేవుపల్లి – విఆర్‌ పురం గ్రామాల మధ్య రెండు చోట్ల వరద నీరు రహదారులపై చేరి రాకపోకలు నిలిచిపోయాయి.

వరదలతో నానా అవస్థలు

ఈ ఏడాది వర్షకాలం మొదలు జూలై నుండి సెప్టెంబర్‌ వరకు ఏజెన్సీలో ఇది 5 వ సారి వరదలు రావడం. ఒకటి రెండు సార్లు వరదలు వచ్చినట్లే వచ్చి తగ్గినప్పటకీ మన్యంలో మూడవసారి వచ్చిన వరద మాత్రం సుమారు 20 రోజులకు పైగే ఉండి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.

మన్యంలో మళ్ళీ మారోమారు వరద వస్తుండటం ఇంకా పెరిగితే ఈ వరదలతో ఆదివాసీల ప్రజల కష్టాలు అన్ని ఇన్ని ఉండవు. అధికారులు మాత్రం భద్రాచలం 47 అడుగుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్‌ ఆదేశాల మేరకు మన్యంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

Leave a Reply