రోడ్డు ప్రమాదం తీవ్రత మహిళ పైనే పడుతుంది….

  • పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్ల

పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ రోడ్డు సేఫ్టీ ఎన్జీవో ఆర్ కనకదుర్గ పద్మజ పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా రోడ్డు భద్రతా అంశాలు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలి అని సీటు బెల్ట్ పెట్టుకుని వాహనం నడపాలని మద్యం సేవించి వాహనం నడపరాదు, అని రోడ్డు భద్రత సూచనలతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అత్యంత విషాదకరమైన సంఘటనలు అని ఒక రోడ్డు ప్రమాదం తీవ్రత ఆ కుటుంబం మహిళ పైనే పడుతుంది అని ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా ఆ కుటుంబం ఎన్నో బాధలకు గురి కావటం తథ్యమని ,పల్నాడు జిల్లా ను రోడ్డు ప్రమాద రహిత జిల్లా చేయడానికి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యముగా జిల్లా రహదారి భద్రతా కమిటీ లో ఎన్. జి. ఓ ల సూచనలు సలహాలు తీసుకుంటాము అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా రహదారి భద్రతా కమిటీ సభ్యులు ఆర్ కనకదుర్గ పద్మజ మాట్లాడుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ గా కృత్రికా శుక్లా రావడం చాలా సంతోషం అని వారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడే ఒక మహిళ రోడ్డు సేఫ్టీ ఎన్జీవో ద్వారా నే రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని నన్ను గుర్తించి ఆ రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఇన్ చార్జీ మంత్రి నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతులు మీదుగా ప్రశంసాపత్రం ఇప్పించడం జరిగింది అని, అంతటి మహోన్నత వ్యక్తి, నిరంతరం జిల్లా అభివృద్ధి కోసం పనిచేసే అధికారి మన పల్నాడు జిల్లా కలెక్టర్ రావడం చాలా సంతోషం వెనుకబడిన పల్నాడు జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ మరియు ఉపాధి కోసం మా రోడ్డు సేఫ్టీ ఎన్జీవో పనిచేస్తుందని అదేవిధంగా రోడ్డు ప్రమాదాల రహిత జిల్లా కోసం స్కిల్ డ్రైవర్లను తయారు చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply