నర్సాపురంను ముంచేస్తున్న మురసు

నర్సాపురం,ఆంధ్రప్రభ: మురుసు తుఫాన్ ప్రభావం తీరాన్ని తాకింది. దీంతో మంగళవారం తెల్లవారు జామునుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షం నర్సాపురం ను ముంచేస్తుంది. పట్టణంలోని ప్రధాన రహదారులతో బాటు పలు రోడ్లు జల మయం కావడం తో ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి ఏక బిగిసిన కురుస్తున్న వర్షం కారణంగా జన జీవనం ఇంటికే పరిమితి అయ్యారు.

రెక్కాడితే డొక్కాడని కూలీలు కూడా కదలని పరిస్థితి. రోడ్లపై రెండు అడుగులకు పైగా నీరు పోర్లడంతో ద్విచక్ర వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సైలెసర్స్ లోకి నీరు వెళ్లి వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది. రోడ్డు పై ఉన్న వర్షం నీరు ఇళ్లలోకి పొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మాధవాయ పాలెం, పొన్నపల్లి, స్టీమర్ రోడ్డు, పట్టణ ప్రధాన రహదారి, గడ్డి బజార్,రాజరాజేశ్వరి, అన్నపూర్ణ , కనకదుర్గ థియేటర్ రోడ్లు మోకాళ్ళ లోతులో నిండిపోయాయి. పట్టణం లోని మారుతీ నగర్, ఇందిరా నగర్, నందమూరి కాలనీ, వై ఎస్ ఆర్ నగర్, గ్రేస్ నగర్ లతో బాటు పల్లపు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. వరుస తుఫాన్ లతో జన జీవనం దయనీయంగా మారింది.

కొద్దిపాటి వర్షాలకే ముంపు బారిన పడే పట్టణ రహదారులు భారీ వర్షాలు కారణంగా రోడ్లు పై నీరు మోకాళ్ల లోతులు నిలిచిపోవడం తో చెరువులను తలపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే పడవలపై తిరగాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. మొన్నటి అర్నబ్, నేటి మురుసు తుఫానుల ప్రభావం నర్సాపురం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనడానికి భారీ వర్షాలే నిదర్శనం. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.