పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ఎన్నికల ఇన్చార్జి గందె శ్రీనివాస్ గుప్తా
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్నికల ఇన్చార్జి గందె శ్రీనివాస్ గుప్తా సూచించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.గ్రామంలోని పట్టభద్రులను గుర్తించి,వారికి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని,గ్రామ పార్టీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,మాజీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు సమన్వయంతో పనిచేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మూడు మాంజిలాల్,ఉపాధ్యక్షులు బోడ సురేష్,గ్రామ ఎన్నికల ఇన్చార్జి బానోతు శ్రీను నాయక్,గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు ధరావత్ భోజ్య నాయక్,ఎండీ సర్వర్ మియా, వార్డు సభ్యులు ఇస్లావత్ రవీందర్,బానోతు ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు ఇస్లావత్ నెహ్రూజీ,మూల ప్రశాంత్ రెడ్డి, నాయకులు బానోతు సాయులు, బానోతు రవీందర్, బానోతు రవి,సపావట్ రవి,పబ్బోజు ఉమేష్,భూక్య రమేష్,మూడు దినేష్,భూక్య నితిన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
