The Raja Saab | అందుకే.. ఆయనకు ఫ్యాన్ అయ్యాను

The Raja Saab | అందుకే.. ఆయనకు ఫ్యాన్ అయ్యాను

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ(Prestigious movie) రాజా సాబ్. ఈ భారీ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ క్రేజీ మూవీని భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్(Huge production values) తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న రాజా సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-release event) ను ఘనంగా నిర్వహించారు.

The Raja Saab | స్పీచ్ అదరగొడతా..

The Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ… మీ అందరి కోసం కొత్త హెయిర్ స్టైల్ లో వచ్చా. అనిల్ తడానీ(Anil Thadani) నా బ్రదర్ లాంటి వారు. ఆయన నా సినిమాలకు నార్త్ లో సపోర్ట్ చేస్తుంటారు. సంజయ్ దత్ గారు క్లోజ్ షాట్ పెడితే సీన్ మొత్తం తినేస్తారు. ఇది నానమ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ గారు నాకు నానమ్మ క్యారెక్టర్లో నటించారు. డబ్బింగ్ చెబుతుంటే.. నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తూ ఉండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ ను అయ్యాను. నాతో పాటు జరీనా గారు కూడా రాజాసాబ్ లో హీరోనే. రిద్ధి, మాళవిక, నిధి ముగ్గురూ బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఈ ముగ్గురు తమ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటారు. నేను తక్కువ మాట్లాడతాను. అయితే.. ఏదో ఒక రోజు వేదిక మీద నా స్పీచ్ ఇస్తా, అందరూ షాకై పోతారు అన్నారు.

The Raja Saab | ఆయనే హీరో..

The Raja Saab

ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ పెరిగింది. అయినా.. ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ గారు సినిమా నిర్మించారు. రాజా సాబ్ కు హీరో విశ్వప్రసాద్ గారే. ఈ రేంజ్ హారర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది. తమన్ చేతుల్లో మా సినిమాను పెట్టాం. మా డీవోపీ కార్తీక్ గారు ఎంతో స్పీడ్ గా క్వాలిటీగా మూవీ చేశారు. మీ వల్లే మా సినిమా క్వాలిటీ ఇంత బాగా వచ్చింది. సొలమన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మూడేళ్ల రాజా సాబ్ స్ట్రెస్, బాధ్యత అన్నీ కలిసి మారుతి గారికి కన్నీళ్లు వచ్చాయి. మారుతి గారిని ఫస్ట్ కలిసినప్పుడు డార్లింగ్ అన్నీ యాక్షన్ మూవీస్ అవుతున్నాయి. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ మన ఫ్యాన్స్ కు ఇవ్వాలి అని అన్నాను అని చెప్పారు.

The Raja Saab | పెన్ – మెషీన్ గన్..

The Raja Saab

హారర్ కామెడీ జానర్ తో ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాం. మారుతి గారు రాసిన స్క్రిప్ట్ కు విశ్వప్రసాద్ గారు ఓకే అని చేసుకుంటూ వస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ కు వచ్చేసరికి మారుతి గారి రైటింగ్ కు నేను ఫ్యాన్ అయ్యాను. ఆయన పెన్ తో రాశారా మెషీన్ గన్ తో రాశారా అనే డౌట్ వచ్చింది. హారర్ కామెడీలోనే కాదు ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. మీరు చూసి చెప్పాలి. మనకు 15 ఏళ్ల తర్వాత మారుతి డార్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు. సినిమా చూస్కోండి.. సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. సీనియర్స్ సీనియర్సే, వాళ్ల దగ్గర నుంచే మేము నేర్చుకున్నది. సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా రాజా సాబ్ కూడా బ్లాక్ బస్టర్ కావాలి. ట్రైలర్ వస్తుంది చూడండి.. అదిరిపోతుంది.. అన్నారు.

The Raja Saab

CLICK HERE TO READ అందాకా ఏగేదెట్టగా..

CLICK HERE TO READ MORE

Leave a Reply