ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ..
మొదటి రెండు గంటల్లో 4.2 శాతం పోలింగ్ నమోదు
విజయనగరం, నవంబర్ 5(ఆంధ్ర ప్రభ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి విజయనగరం జిల్లాలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాల్లో 103 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా 449 ఎంపీటీసీ స్థానాలకు 11 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 438 ఎంపీటీసీ స్థానాలకు 1,066 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జిల్లాలో మొత్తం ఓటర్లు 12,85,692 మంది ఉన్నారు.పురుష ఓటర్లు 6,35,994 మంది కాగా, మహిళా ఓటర్లు 6,49,661 మంది,ఇతర ఓటర్లు 37 మంది ఉన్నారు. మొత్తం 388 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా 323 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు.
