వ్యక్తి ఆత్మహత్య
శివ్వంపేట, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య(suicide) చేసుకున్న సంఘటన మండలంలోని సీతారాం తండాలో ఈ రోజు జరిగింది. మండలంలోని సీతారాం తండాకు చెందిన కాట్రోత్ తరుణ్ (30) కు పక్కన గల జగ్యతండాకు చెందిన చాంకితో వివామైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మృతుడు తరుణ్(Tarun)కు ఆయన భార్యకి నాలుగైదు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన పిల్లలతో కలిసి చాంకి పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో మనస్తాపం చెంది మధ్యాహ్నం(Afternoon) ఇంట్లో ఎవరు లేని సమయంలో తన ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

