The Paradise Movie | సెన్సార్‌ టాక్‌తో పెరిగిన అంచనాలు.. థియేటర్లు దద్దరిల్లనున్నాయా?

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ డ్రామా ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది.

‘ది ప్యారడైజ్‌’ సినిమా సుమారు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్‌ ఎలిమెంట్స్‌, ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు బలమైన కథనం ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. సినిమాలో ఫైట్స్‌ చాలా ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. గతంలో చూడని స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ఇంపాక్ట్‌ ఉండేలా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కథను రూపొందించినట్లు తెలుస్తోంది.

ప్రతి క్యారెక్టర్‌కు సరైన ఎలివేషన్‌ ఇచ్చారని, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ అందిస్తున్న పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇప్పటికే అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా మాస్‌ సన్నివేశాల్లో అనిరుధ్‌ బీజీఎం థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

మాస్‌తో పాటు ఎమోషన్‌ కూడా..

‘ది ప్యారడైజ్‌’ కేవలం యాక్షన్‌ సినిమాగా కాకుండా ఎమోషన్‌, సెంటిమెంట్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చిన చిత్రంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుడిని కథతో కనెక్ట్‌ చేసే భావోద్వేగ అంశాలు కూడా సినిమాలో కీలకంగా ఉంటాయని సమాచారం. ‘దసరా’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈసారి మరింత భారీ స్థాయిలో ‘ది ప్యారడైజ్‌’ను తెరకెక్కిస్తున్నారు.

‘దసరా’ కంటే పెద్ద స్కేల్‌, కొత్త విజన్‌తో ఈ సినిమా రూపొందుతోందనే టాక్‌ ఉంది.తెలంగాణ నేపథ్యంతో మాస్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌, ఎమోషన్‌ కలగలిపిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ని కెరీర్‌లో మరో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.