పనుల వేగం పెంచాలి – దామోదర రాజ నర్సింహా

పనుల వేగం పెంచాలి – దామోదర రాజ నర్సింహా

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశించారు. ఈ రోజు సంగారెడ్డిలోని తన నివాసంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలలోని ఆర్ అండ్‌ బీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో విస్తరించి ఉన్న అందోల్ నియోజక వర్గ పరిధిలో పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టుతున్న రోడ్ల నిర్మాణ పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేస్తున్న రోడ్ల నిర్మాణ మరమ్మతుల‌ పనులు, కొత్తగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు, వివిధ పాఠశాలలో నిర్మిస్తున్న టాయిలెట్స్ బ్లాక్స్ ల నిర్మాణ పనుల పై మంత్రి చర్చించారు. మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లే కనెక్టివీటి రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో గార్లపల్లి – అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతి పై ఆరా తీశారు. పనుల వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోరావాలని సూచించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ శాఖ, ఎస్ఈ జగదీశ్వర్, ఈఈ నర్సింహులు, డిప్యూటీ ఈఈ ప్రభాకర్, డిప్యూటీ ఈఈ కృష్ణ ఇతర ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply