నేరేడి బ్యారేజీతో జిల్లాను సస్యశ్యామలం

  • అందరి సహకారంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం
  • విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • 35 వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు
  • రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
  • 2027 జూన్ నాటికి ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి
  • పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఆంధ్రప్రభ: నేరేడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామం చేస్తామని విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.‌ కాశీబుగ్గలో రూ.122 వ్యయంతో వలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ తాగునీటి ప్రోజెక్టు, రూ.5 కోట్లు సుడా నిధులుతో మున్సిపాలిటీ అభివద్ధి, శంకుస్థాపన, రూ.48 కోట్లతో రైల్వే ప్లేఓవర్ వంతెనను కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మేల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి గౌతు శివాజీలు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వంశదార, నేరేడి అనుసందానం చేసేందుకు ఆరు శతాబ్దాలు కలగా మిగిలిపోయిందని, కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ద్వారా నేరేడి, వంశదార అనుసందాన సమస్య పరిష్కరం చేయగలిగామని కేంద్ర విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బ్యారేజి నిర్మాణం కోసం రూ.640 కోట్లుతో కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యారేజి నిర్మాణం కోసం రూ. 640 కోట్లు సరిపోతుందని అనుకున్న తరుణంలో రూ. 1050 కోసం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రోజెక్టు మాదిరిగా ఆర్ ఓ బి వంతెన ఉంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించి కేంద్ర నిధులతో 9 నెలలోను వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించామన్నారు.

మరో రెండేళ్లలో కాశీబుగ్గ తాళభద్ర ఆర్ ఓ బి పూర్తి చేసి పట్టణ ప్రజలకు అంకితం చేస్తామన్నారు. పలాస రైల్వే స్టేషన్ ఖుర్దా డివిజన్లో ఉండగా పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఏడు రైల్వే స్టేషన్లను విశాఖ డివిజన్ లో కలిపి అభివద్ధి చేస్తున్నామన్నారు. పలాస రైల్వే స్టేషన్ అభివద్ధి కోసం రూ. 40 కోట్లు వ్యయంతో అమృత భారత్ పధకం ద్వారా అభివద్ధి చేస్తున్నామన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడితే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఆ ప్రాంత ప్రజలు స్వచ్చందంగా భూములు ఇచ్చి సహకరించాలన్నారు. జిల్లాకు పెట్టుబడులు తీసుకువచ్చి జిల్లా అభివద్ధి చేసేందుకు కషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఒక వైపు తాగునీరు, మరోవైపు సాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.

35 వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు..

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో రూ.35 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నెట్ కంపెనీ ముందుకు వచ్చిందని అందుకు పూండి ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుకు భూములు పరిశీలిస్తున్నామన్నారు. కంపెనీ ఏర్పాటు కోసం వంద ఎకరాలు అవసరం ఉందన్నారు. రెండున్నర ఏళ్లతో 98 శాతం సంక్షేమ పధకాలు అందించామన్నారు. రాష్ట్రంలో 16.50 లక్షలు పించన్లు కోసం ధరఖాస్తు చేసుకున్నారని అర్హులైన ప్రతీ ఒక్కరికి పించన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పధకం ప్రారంభించి 14 నెలలలో వంద కోట్ల మంది బస్సు ప్రయాణిన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

19 ఏళ్లగా ఆర్ ఓ బి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఎలాగైనా వంతెన పూర్తి చేస్తామని కంకణం కట్టుకొని రాంమోహన్ నాయుడు చొరవతో పూర్తి చేయగలిగామన్నారు. దసరా నాటికి వంతెన పై నుంచి రాకపోకలు సాగుతాయన్నారు. ఆర్ ఓ బి నుంచి జాతీయ రహదారి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపడతానని హామి ఇచ్చారు. అందుకు పట్టణ ప్రజలు సహకరంించాలనికోరారు. జిల్లా కేంద్రానికి తలదన్నే విదంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని అభివద్ధి చేస్తామని హామి ఇచ్చారు.

2027 జూన్ నాటికి ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి..

పలాస ఎమ్మేల్యే గౌతు శిరిష మాట్లాడుతూ ఆఫ్షోర్ రిజర్వాయర్ 2027 జూన్ నాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఎమ్మేల్యే పదవి అధికారం, హోదా కాదని బాధ్యతని అన్నారు. రెండున్నర ఏళ్లలో రూ.2 వేలు కోట్లతో నియోజకవర్గంలో అభివద్ధి పనులు చేపట్టామని దీనిని వైసీపీ నాయకులు ఆర్ టి ఐ యాక్టు ద్వారా నిజాలను తెలుసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి అప్పలరాజు వంశదార నీరు చుక్క నీరు కూడా తేలేకపోయారని ఎమ్మేల్యేగా వదవి చేపట్టి నప్పటి నుంచి వరుసగా మూడేళ్లుగా శివారు భూములకు అందించామన్నారు. రూ.48 లక్షలతో రైతు బజారు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే వైసీపీ నాయకులు కె్రెడిట్ చోరీ అంటూ ప్రచారం చేయడం తగదన్నారు.

హుద్ హుద్, టిట్కో ఇళ్లు నిర్మాణం టిడిపి హయాంలోనే జరిగాయని, పూర్తిచేసిన ఇల్లు వైకాపా ప్రభుత్వం పంపిణీ చేయలేకపోయిందన్నారు. కెటిరోడ్ విస్తరణ పేరుతో మాజీ మంత్రి సిధిరి లక్షల రూపాయలు వ్యాపారుల నుంచి వసూలు చేసి అరకొరగా పనులు చేపట్టారని ఆరోపించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మర్ అహ్మద్ ఖాన్, పలాస ఆర్ డి ఓ ఆర్ అప్పలరాజు, జనసేన పలాస నియోజకవర్గ సమన్వయకర్త వి దుర్గారావు, ఎఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పి విఠల్ రావు, కాంట్రాక్టర్ మన్మోహన్, లొడగల కామేశ్వరరావు గురిటి సూర్యనారాయణ గాలి కృష్ణారావు డొక్కరి శంకర్ టంకాల రవిశంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.