మూసీ నదిని పరిరక్షించాలి…

ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్


వికారాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రప్రభ): వికారాబాద్ లోని అనంతగిరిలో జన్మించిన మూసీ నదిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తున్న కృషి అభినందనీయమని జీవనది ఫౌండేషన్ చైర్మన్ పట్లోళ్ల శివకుమార్ అన్నారు.

బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను స్వయంగా కలిసిన శివకుమార్ మాట్లాడుతూ… మూసీనది ప్రక్షాళన కోసం హైడ్రా చేస్తున్న కృషికి అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. మూసీ నది అంటే జీవనది అని, అది మురికి కాలువగా మారకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.