యూరియా యాప్ ను తక్షణమే తొలిగించాలి

యూరియా యాప్ ను తక్షణమే తొలిగించాలి
- ఉద్యమ నాయకులు న్యాయవాది నగేష్ రాథోడ్
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ పట్టణ కేంద్రం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ముందు గురువారం బిఆర్ఎస్ నాయకులు యూరియా యాప్ ను తొలగించి పాత పద్ధతిలోనే యూరియాను అందించాలని కోరుతూ నిరసనను తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, న్యాయవాది నగేష్ రాథోడ్ మాట్లాడుతూ… యాప్ విధానం వలన నిరక్షరాస్యులు అయిన రైతులు యూరియా ను యాప్ నందు బుక్ చేసుకోలేక కష్టాలు పడుతున్నారని, ఒక వేళ తిప్పలు పడి బుక్ చేసిన వేరే ప్రాంతాల నుండి రవాణా చేసుకోలేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
యూరియా సప్లై ను పెంచి పాత విధానంలోనే రైతులకు యూరియాను అందించాలని యాప్ వలన ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళారులను ప్రోత్సహిస్తూ బ్లాక్ దందా కు తెరలేపింది అని యాప్ విధానం వలన అధికారులకు దగ్గరగా ఉన్న నాయకులకు స్టాక్ ఎప్పుడు వస్తుందో ముందే తెలిసిపోయి వారే యూరియాను క్షణాలలో బుక్ చేసుకొని పరోక్షంగా బ్లాక్ దందాకు తెరలేపారని యూరియా తీవ్ర కొరత వలన రోజు రోజుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత అధికం కావడం వలనే ఈ యాప్ విధానం ను తీసుకొచ్చి వారి తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు.
తప్ప ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా కష్టాలు ఎక్కువ అయ్యాయి అని షాప్ లలో లేని యూరియా యాప్ లలో ఎలా ఉంటుంది అని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 13.42 లక్షల ఎకరాలలో రైతులు పంటలను సేద్యం చేసుకుంటున్నారని ముఖ్యంగా వరిని 13.19 లక్ష ల ఎకరాలలో సేద్యం చేస్తున్నారని ప్రతి ఎకరానికి రెండు బస్తాల చొప్పున రైతులకు యూరియా అవసరం అవుతుందని ఈ ప్రభుత్వం మరియు అధికారులు రైతులకు సకాలంలో యూరియాను అందించలేక పొట్ట దశకు వచ్చినటువంటి వరి ఈరోజు ఎండిపోయి సరైన ఉత్పాదక రాక అప్పుల పాలై రైతులు కంటతడి పెట్టుకుంటున్న సందర్భం ఈరోజు తెలంగాణలో కనబడుతుందని…
కాబట్టి ఈ యాప్ ను వెంటనే తొలగించి వంట గ్యాసును బుక్ చేసుకోవడానికి ప్రజలు ఏ రకంగా అయితే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వాలు అందిస్తున్నాయో అదేవిధంగా యూరియాను బుక్ చేసుకోవడానికి కూడా రైతులుకు ఒక టోల్ ఫ్రీను అందించి ఇంటి వద్దకే యూరియాను సప్లై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు న్యాయవాది నగేష్ రాథోడ్, మాజీ సర్పంచ్ బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్, భూక్య చంద్రమౌళి నాయక్, ఇస్లావత్ బాలాజీ పవర్, మెరిగ సాయికుమార్, రైతు నాయకులు కృష్ణారెడ్డి, సోమ గాని మల్లయ్య, వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు
