పరమ పవిత్రం.. భవానీ దీక్ష

  • ఇంద్రకీలాద్రిపై వైభ‌వంగా ప్రారంభం
  • భక్తితో మాల స్వీకరించిన భవనీయులు.

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : పరమ పవిత్రంగా నిర్వహించే భవానీ దీక్షల కార్యక్రమం అత్యంత వైభవంగా ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైంది. 41 రోజులపాటు కఠిన దీక్షా నియమాలతో ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులు ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రధానాలయం నుండి ఆరవంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి వచ్చిన అనంతరం ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మాలాధారణ స్వీకరించేందుకు వచ్చిన భవానీలకు గురు భవానీలతో పాటు అర్చకులు మాలాధారణ చేశారు. జై భవాని జై జై భవాని నినాదంతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగింది.

కఠినం భవాని దీక్ష

అత్యంత పవిత్రంగా అమ్మవారి భవానీ దీక్షను ఆచరించేందుకు భవానీలు 41 రోజులపాటు మండల దీక్షను తరువాత 20 రోజులపాటు అర్ధమండల దీక్షను కొందరు భక్తులు 11 రోజులపాటు దీక్షను స్వీకరిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై నవంబర్ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు భవాని మండల దీక్షల దారులను ప్రారంభమవుతున్నాయి. అర్ధమండల దీక్షలు నవంబర్ 21 నుంచి 25 వరకు స్వీకరించనున్నారు డిసెంబర్ 4వ తేదీన కలస జ్యోతి ఉత్సవము డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవాని దీక్ష విరమణలు జరగనున్నాయి.

దీక్ష విరమణ లో భాగంగా అగ్ని ప్రతిష్టాపన సత చండీయాగం గిరి ప్రదక్షణ లను నిర్వహించనున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం అత్యంత క్లిష్టమైన భవానీ దీక్షను జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుందని గురు భవానీలు చెబుతున్నారు. నిత్యం అమ్మవారి నామస్మరణ జపిస్తూ అమ్మవారిని తలుచుకుంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ, ప్రతిరోజు రెండు పూటలా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అంటున్నారు. తమపై ఎల్లప్పుడూ అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ భవానీలు దీక్షను పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారు.

Leave a Reply