పేదలకు అండగా నిలచిన స్వర్గీయ ఎన్టీఆర్
పాయకాపురం, ఆంధ్రప్రభ: పేదలకు అండగా స్వర్గీయ ఎన్టీఆర్ నిలచి, వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడ్డారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.స్థానిక62వ డివిజన్ ప్రకాష్ నగర్ ప్రాంతంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. తెలుగు సినీ నటుడిగా మాత్రమే కాకుండా, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ టీడీపీ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పేదలకు అందజేశారని అన్నారు.
అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే బొండా ఉమా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కర పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి పైడి శ్రీను, తులసి, అధ్యక్షుడు జలకం రాజారావు, బోను వెంకాయమ్మ,బెజ్జం జైపాల్, బోను శ్రీను,ఏ.గోపి రెడ్డి,మక్కా జగదీష్, జూలూరు సాయి,సి.హెచ్ రవి, రౌతు మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
