కుంటుప‌డుతున్న అభివృద్ధి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) నిర్వహించే ధైర్యం సర్కార్‌కు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట‌ ఎమ్మెల్యే టి.హరీష్ రావు (Harish Rao) అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గ (Secunderabad constituency) పరిధిలోని రాంగోపాల్ పేటలో పర్యటించిన ఆయన.. ఇటీవల వరదకు ప్రభావితులైన బాధితుల కుటుంబాలను పరామర్శించారు. వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచాయతీల్లో నయా పైసా లేదన్నారు. పంచాయతీ సెక్రటరీలు (Panchayat secretaries) అప్పులపాలయ్యారని, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కనీసం పండుగపూట కూడా గ్రామాల్లో చెత్తకుప్పలు ఎత్తే పరిస్థితి లేదన్నారు. బతుకమ్మ పండుగకు (Bathukamma Festival) ఏర్పాట్లు చేసేందుకు గడ్డిమందు కొట్టించేందుకు కూడా పైసలు లేని అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువగా ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. కనీసం పండుగపూటనైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరిచి.. గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply