కష్టాల్లో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం

సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు, బొండా సిద్ధార్థ

పాయకాపురం, ఆంధ్రప్రభ: సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయం వద్ద 62వ డివిజన్ ప్రకాష్ నగర్‌కు చెందిన గొర్రెల రాణికి స్వయం ఉపాధి నిమిత్తం టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటోను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ చేతుల మీదుగా అందజేశారు. రాణి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను వివరించి, జీవనోపాధి కోసం ఆటో అందజేయాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే, ఆమెకు స్వయం ఉపాధి కల్పించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. బొండా సిద్ధార్థ మార్గదర్శకత్వంలో రూ.25,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఎలక్ట్రిక్ ఆటోను అందించేలా సహకరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 62వ డివిజన్ ఇంచార్జ్ పైడి శ్రీను,బుదాల సురేష్, పాస్టర్ శామ్యూల్, గౌసియా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.