- గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా
- 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి
- కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోలెపల్లి సంపత్ రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: పాంనూర్ గ్రామాభివృద్ధినే లక్ష్యంగా తీసుకుని పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదాలే తనకు బలం అని సర్పంచ్ అభ్యర్థి పోలెపల్లి సంపత్ రెడ్డి తెలిపారు. గ్రామంలో మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని, డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
ఆదివారం ఆయన భార్య, పిల్లలతో కలిసి పాంనూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజా సేవ చేసే బాధ్యత ఇవ్వాలని, గెలిపిస్తే అభివృద్ధి కోసం పలు హామీలను అమలు చేస్తానని తెలిపారు.
కాశివాడ ప్రాంతంలో సైడ్ మోరీలు, తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు, లైటింగ్ సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తానన్నారు. కబ్రస్తాన్ నిర్మాణం, మైనారిటీ కమిటీ హల్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. బంజారా కాలువ, పర్రె కాలువ వంటి ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
యువతకు ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించేందుకు ముందుకు వస్తానని, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఎస్సీ కాలనీలో స్మశానవాటిక, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
ఐకేపీ సెంటర్‌కు భూమి లేదని, స్మశానవాటిక పక్కనున్న భూమిని ఐకేపీ కోసం ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. మహంకాళి గుడి నుంచి పోలేపల్లి వరకు రోడ్డు, ఉప్పగల్లు క్రాస్‌రోడ్ నుంచి కాశివాడ వరకు సీసీ రోడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాశివాడ ఎస్సీ కాలనీల్లో ప్లాట్లు, ఇళ్ల సమస్యను మాజీ మంత్రి కడియం శ్రీహరి సహాయంతో పరిష్కరిస్తానని తెలిపారు.
మొత్తంగా గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, పాంనూర్‌కు సమర్థవంతమైన పరిపాలన అందించడమే తన లక్ష్యమని సంపత్ రెడ్డి పేర్కొన్నారు.

