అమరావతి : ఏపీలో పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు (Police constables final results released) విడుదలయ్యాయి. మంగళగిరి (Mangalagiri) లోని డీజీపీ ఆఫీసు (DGP Office) లో హోంమంత్రి అనిత (Home Minister Anita) శుక్రవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి తుది ఫలితాల స్కోర్ కార్డులు చూడవచ్చు. కాగా, ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,03,487 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:
- https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- అందులో AP Police Constable Final Result 2025 లింకుపై క్లిక్ చేయాలి.
- అది లాగిన్ పేజీలో మీ రోల్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ పుట్టిన తేదీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.