ఆలయ ఆదాయ-వ్యయాల వివరాలు వెల్లడి

ఆలయ ఆదాయ-వ్యయాల వివరాలు వెల్లడి

మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రాచీన శివరామ ఆలయంలో 2020 నుంచి 2026 వరకు జరిగిన ఉత్సవాలకు సంబంధించిన ఆదాయ-వ్యయాల వివరాలను ఆలయ కమిటీ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ అభివృద్ధి,కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.ఆలయంలో కులాలకు అతీతంగా జరిగే కార్యక్రమాలకు గ్రామస్తులు క్రమశిక్షణతో ముందుకు రావాలని, రాజకీయ విద్వేషాలకు తావివ్వకుండా సామరస్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

కొందరు వ్యక్తులు ఆదాయ-వ్యయాలపై సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో గందరగోళం సృష్టించి, అభివృద్ధికి సహకరించిన వారిపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఆలయ అభివృద్ధి కోసం సహకరించే వారిని ప్రోత్సహించడం మన బాధ్యత అని గుర్తు చేశారు.అన్ని ఖర్చులు పోను మిగిలిన మొత్తం రూ.57,208ను ఏపీజీవీబీ బ్యాంక్‌లో జమ చేసినట్లు తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ రాజీనామా పత్రాన్ని సర్పంచ్‌కు రాతపూర్వకంగా అందజేసినట్లు పేర్కొన్నారు.


ఈ సమావేశంలో మాజీ చైర్మన్ పాల్వాయి యాదగిరిరెడ్డి,యడవెల్లి సురేష్ కుమార్, పెరుమాళ్ల ప్రమోద్ కుమార్,కంచర్ల వెంకన్న, మునుగోటి యాదయ్య, సింగం గిరి,రెవెల్లి సైదులు,కళ్యాణ్ కార్ మల్లాజీ,దొమ్మాటి వెంకన్న,శ్రీరామోజీ శ్రీను, ఏం. నరసింహ,ధోమ్మాటి శంకరయ్య,సైదులు, శంకర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply