దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: ఈ నెల11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖర స్వామి వారి దేవస్థానంలో జరిగే శరన్నవరాత్రి దేవీయాగ మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారిని దేవస్థానం తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి సమేత రాజశేఖర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు, దేవస్థానముల ఈఓ యార్లగడ్డ శ్రీనివాసరావు (వాసు), రాజశేఖర స్వామి దేవస్థానం ట్రస్టీలు విష్ణుభోట్ల లక్ష్మీనరసమ్మ, అవనిగడ్డ రమేష్, వెణుతురుమిల్లి వెంకటేశ్వరరావు, కోసూరు అవినాష్, శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి ట్రస్టీలు మత్తి శివపార్వతి, బట్టు మాధవి మోపిదేవి శివకుమార్, నలుకుర్తి రాము, దేవస్థానముల సిబ్బంది పాల్గొన్నారు.
