వెల్దుర్తి మండల సమగ్రాభివృద్ధే ధ్యేయం..!
- లావు, జూలకంటి సుడిగాలి పర్యటన
- రూ.4.20 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
వెల్దుర్తి, ఆంధ్రప్రభ: మాచర్ల నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన వెల్దుర్తి మండల సమగ్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ చేయమని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. మంగళవారం మండల పరిధిలో ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఉప్పలపాడు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా రూ.55 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం వెల్దుర్తి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు విద్యార్థుల కోసం రూ. 3.15 కోట్లతో నిర్మించిన వసతి గృహం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రాఫ్ట్ భవనాలను ప్రారంభించారు. పాఠశాల నందు వసతులను, విద్యార్థులకు అందుతున్న విద్యపై సమీక్షించారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రూ. 55 లక్షలతో నూతనంగా నేర్పించిన ఐటీడీఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం జిల్లా పరిషత్తు హై స్కూల్ నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తాత్కాలిక భవనాలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వసతి గృహ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో ప్రజలు గజమాలతో బ్రహ్మరథం పట్టారు. డీజే మోతలు, నత్యాలు నడుమ సాదారంగా ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కుర్రి శివారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కళ్ళం రామంజి రెడ్డి, ఎంపీపీ సంజీవరెడ్డి, జూలకంటి చిరంజీవి రెడ్డి, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, కేశిరెడ్డి హనిమిరెడ్డి, వెంకటరెడ్డి,శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
