పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

మునుగోడు, ఆంధ్రప్రభ : 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మునుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలు పరిశీలించి పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు,సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని,మాల్ ప్రాక్టీస్ వంటి ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారి వెంట ఇంచార్జ్ తహసిల్దార్ నేలపట్ల నరేష్,మండల విద్యాశాఖ అధికారి తలమల్ల మల్లేశం, ఉపాధ్యాయులు బాల ప్రసాద్,సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply