వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గౌడ్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… నా తెలంగాణ కోటి రతనాల వీణ అని, తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాల్లో విదేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానిస్తుందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మనవాళ్లు చదువుకోవడానికి వెళ్లే వారికి ఆటంకం కలుగుతుందన్నారు. దౌత్య సంబంధాల్లో (diplomatic relations) విదేశాంగ శాఖ ఇలాంటి నియంత్రణలు పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇక్కడి నుండి చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు ఉపాధి కోసం వెళ్లేవారికి ఇది పెద్ద ఆటంకంగా మారుతుంద‌న్నారు.

ఈ సందర్భంగా అమెరికా (America), ఇత‌ర‌ దేశాల్లో ఉన్నటువంటి మన మేధావులు, విద్యార్థులు మన దేశానికి సంబంధించిన 100మంది సీఈవోలు ఇతర దేశాల్లో ఉన్నారని, మీ తెలివి తేటలను ఇక్కడ పెట్టండని, ప్రభుత్వాలు రెడ్ కార్పొరేట్ వేసి మీకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. దేశాల్లో పెట్టిన పెట్టుబడి తెచ్చి ప్రభుత్వాలు మీకు అనుకూల పాలసీలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయండని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు.

Leave a Reply