యువకుని మృతదేహం లభ్యం..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ వాసి, ఐరన్ హార్డ్వేర్, సిమెంటు వ్యాపారి గుండ శ్రావణ్ కుమార్ (32) మృతదేహం బాదంపల్లి గోదావరి నది రేవులో ఆదివారం ఉదయం 8:30 గంటలకు లభించింది. మృతుడు శనివారం ఉదయం బాదంపల్లి గోదావరినదికి స్నానానికి వెళ్లి ఫోటోలు తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో గల్లంతైన విషయం విధితమే. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు. పొనకల్ గ్రామానికి చెందిన వ్యాపారి గుండ లచ్చన్న, వనజ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, అందులో శ్రావణ్ రెండో కుమారుడు. శ్రావణ్ వ్యాపార రీత్యా అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండేవాడని.. అతను చనిపోవడం బాధాకారమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని తండ్రి లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

