బార్ అసోసియేషన్ మార్గదర్శకంగా ఉండాలి..
లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : బార్ అసోసియేషన్(Bar Association) అధ్యక్షునిగా ఎన్నుకున్న గాండ్ల సత్యనారాయణను జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ ఈ రోజు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులకు సేవలందించే క్రమంలో బార్ అసోసియేషన్ మార్గదర్శకంగా ఉండాలన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత మేరకు న్యాయవాదులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు.
కాగా, గత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కొమిరెడ్డి సత్తన్న(Komireddy Sattanna)కు, గాండ్ల సత్యనారాయణకు సమాన ఓట్లు పోల్ కావడంతో నిబంధనల మేరకు ఆరు నెలల చొప్పున పదవీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే గాండ్ల సత్యనారాయణ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సత్యనారాయణ(Satyanarayana) తనకు సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
బార్ అసోసియేషన్ ఆదర్శంగా ఉండేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ అజయ్ కుమార్(APP Ajay Kumar), మాజీ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, ఎలక్షన్ కమిషనర్ గోవిందరావు, ఏజీపీ బి సంతోష్, వైస్ ప్రెసిడెంట్ నలినీకాంత్, జనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎన్ సత్య గౌడ్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమారెడ్డి, సురేందర్, శ్రీధర్, కిరణ్ కుమార్, రవీందర్, రవికుమార్, జి పద్మ, రహమతుల్లా, రాజేశ్వర్, సదాశివ్, శివశంకర్, గణేష్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

