చండూరులో కాంగ్రెస్‌ నేతల రాస్తారోకో

చండూరు, ఆంధ్రప్రభ : రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతల అరెస్టులను ఖండిస్తూ చండూరులో కాంగ్రెస్‌ నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ డా. కోడి శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐతరాజు మల్లేశ్ త‌దిత‌రులు ప్ర‌సంగించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భూతరాజు దశరథ, జిల్లా నాయకుడు కాసాల జనార్దన్‌రెడ్డి, కౌన్సిలర్‌ కోడి సుష్మ వెంకన్న, మండల, పట్టణ మహిళా విభాగం అధ్యక్షులు పందిరి రాధ, కారింగు పల్లవి, ఫరీప్‌, మొగుదాల వెంకన్న, కో-ఆప్షన్‌ సభ్యుడు ఖలీల్‌, కాంగ్రెస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి సంగెపు శ్రీను, నాయకులు పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, నేర్లకంటి రవికుమార్‌, సుజావుద్దీన్‌, కన్నెబోయిన నాగరాజు, ఇరిగి వెంకటేశం, గండు వెంకట్‌గౌడ్‌, రమాదేవి, పంగ రామకృష్ణ, బొల్ల జనార్దన్‌, సత్యం, సర్వేశ్‌చారి తదితరులు పాల్గొన్నారు.