యాప్‌ తిక్కిరిబిక్కిరి

  • నమోదులో పత్తి రైతుల ఇక్కట్లే ఇక్కట్లు

కర్నూలు సిటీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం 2025.. 2026 కు గాను పత్తి సీజన్‌ కు కనీస మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో పత్తి రైతులు పత్తిని విక్రయించేందుకు సీసీఐ ఏర్పాటు- చేసిన కొనుగోలు కేంద్రానికి పెంచికలపాడు దగ్గర పత్తి మిల్లు కు క్యూ కట్టారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరగా 8060 రూపాయలు ప్రకటించింది.

తేమశాతం 8 నుండి 12 శాతం వరకు మాత్రమే ఉంటేనే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పత్తి కొనుగోలు చేస్తుంది. ఎనిమిది నుండి 12 శాతం పెరిగిన ప్రతి ఒక్క శాతానికి మద్దతు ధరలో తగ్గుతుంది. 12 శాతం కంటే ఎక్కువ వచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయని ముందే ప్రకటించింది.ఈ నేపథ్యంలో కాటన్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి ఒక్క తే మ శాతాన్ని 12 శాతం లోపల ఉంటేనే కాటా – వేసి కొనుగోలు చేస్తుంది.

యాప్‌ తో ఉక్కిరి బిక్కిరి

రైతులు పత్తిని విక్రయించడానికి తమ సమీపంలోని సచివాలయానికి లేదా రైతు భరోసా కేంద్రంలోని సీఎం అఫ్‌ ద్వారా నమోదు చేసుకొని రైతుల సెల్ఫోన్‌ నుండే కపాస్‌ కిసాన్‌ యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకుని పత్తి విక్రయించే తేదీని స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. స్లాబ్‌ స్లాబ్‌ బుక్‌ అయిన తర్వాత సీసీఐ విజయవాడ ఆ తేదీని రైతుల సమీపం లోని కొనుగోలు కేంద్రాలకు పంపిస్తారు.

సదరు తేదీని రైతులు గమనించి పత్తిని ఆరబోసుకొని కొనుగోలు కేంద్రానికి లోజుపత్తిని తీసుకుని రావాలి. అక్కడ తేమశాతం లెక్కించి కాటా వేసి రైతు యొక్క బ్యాంకు ఖాతా ఆధార్‌ నెంబర్లను తీసుకొని వారి సొమ్మును ఖాతాల్లో జమ చేస్తారు. ఇదంతా జరగాలంటే కెపాసికిసాన్‌ యాప్‌ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొనుగోలు కేంద్రంలో అత్యధిక కనబడకపోవడం, కొందరి తేది లు కనిపించిన ముందస్తు సమాచారం తెలియకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గత 30 గత అక్టోబర్‌ 30 తేదీ నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు 156 బిల్లులకు గాను 3176 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు- సీసీఐ ఇన్చార్జి దారప్ప తెలిపారు.

చర్యలు తీసుకుంటాం .. ఏడీఎం నారాయణ మూర్తి :

రైతులు తమ పత్తిని విక్రయించాలంటే కపాస్‌ కిసాన్‌ యాప్‌ లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని 12 శాతం లోపల తేమ శాతం ఉండేటట్లు- చూసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ ఏడిఎం నారాయణమూర్తి, కోడుమూరు మార్కెట్‌ కమిటీ- సెక్రటరీ సుందర్‌ రాజు రైతులకు విజ్ఞప్తి చేశారు యాప్‌ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను సిసిఐ విజయవాడ వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారు త్వరగా పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. మొదటి దశలో రైతు పత్తిని 60 శాతం కొనుగోలు చేస్తామని డిసెంబరు మొదటి వారి నుంచి మిగతా 40 శాతం సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందని తెలిపారు.

90 క్వింటాళ్లు ఎప్పుడు అమ్మాలి .. రైతు తిప్పన్న

తనకు 14 ఎకరాల పొలం ఉందని పత్తి పంట వేస్తే 90 క్వింటాళ్ల పత్తి పండిందన్నారు. ఈ పత్తిని విక్రయించాలంటే యాప్‌ లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే ఏడో తేదీ బదులు ఆరో తేదీ విక్రయించమని సీసీఐ వారు చెబుతున్నారని 90 కింటాల పత్తి ఎలా తీసుకొచ్చేదని రైతు వాపోయాడు. ఈ సమస్యలు అధికారుల పరిష్కరించాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply