ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

చిత్తూరు, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినుతల పరిష్కారం(solution)లో నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాదరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని(in the Collectorate) సమావేశ మందిరంలో నిర్వహించిన పి.జి.ఆర్.యస్ కార్యక్రమం(program)లో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 339 అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాదరి స్వీకరించారు.

ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్(Narendra Padal), డిఆర్ఓ కె.మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమ కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్(Joint Collector) మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితులో పరిష్కారానికి చర్యలు(Actions) తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపైవిశ్వాసం కలుగుతుందన్నారు.

Leave a Reply