వైభవంగా అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట గ్రామంలో విజయ్‌ జేబీ వెంచర్ ఆవరణలో శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఏనుగు మాధవరెడ్డి 18 మెట్టు గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో గురుస్వాములు పెద్దఎత్తున అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేశారు.

కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి కచేరి, గురుస్వాములకు సన్మానాలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలదారులకు అన్నప్రసాదాల పంపిణీను నిర్వహించారు.

ఈ మహా పడిపూజలో చౌటుప్పల్ మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జేబీ వెంచర్ యజమాని విజయ్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ చక్రం జంగయ్య, మాజీ ఉప సర్పంచ్ ఏనుగు బాలమణి మాధవరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. వందలాది మంది గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు, భక్తులు ఈ వేడుకకు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Leave a Reply