ఆ.. దొంగల ముఠా అరెస్ట్..

ఆ.. దొంగల ముఠా అరెస్ట్..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పలు రాబరీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేసిన ఆరుగురు నిందితులని పట్టుకుని, వారి వద్ద నుండి మూడు మోటార్ బైకులు, ఒక బంగారం ఛైను, ఒక పుస్తెల త్రాడు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు తరలించినట్లుగా చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి తెలిపారు. దొంగతనాలు, దొంగల వివరాలను సోమవారం రాత్రి ఏసీపీ వెల్లడించారు.
ఏసీపీ కథనం ప్రకారం.. వలిగొండలోని బీరప్ప గడ్డకు చెందిన కల్లెం శ్రీను @ డాన్ శ్రీను, @ భోంగిర్ శ్రీను (32), భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి దంతూరి పవన్ (25), చౌటుప్పల్ పట్టణంలోని శివాజీ నగర్ కాలనీకి చెందిన కల్లెం సాయికుమార్ (23), వలిగొండలోని సాయి నగర్ కాలనీకి చెందిన గడికె భరత్ (22), చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన కామాధుల తిరుపతి (21), చౌటుప్పల్ పట్టణంలోని రత్నా నగర్ కు చెందిన పస్తం మల్లేష్ @ మల్లిఖార్జున్ (24) లు ఒక మూఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా పలు దొంగతనాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుండడంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారిని రిమాండ్ కు తరలించినట్లుగా ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు.

