TG | ఆ ఇద్దరు ఐపిఎస్ లు రిలీవ్…. పెండింగ్ లో కరీంనగర్ సిపి
హైదరాబాద్ – తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతీలను రిలీవ్ చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులను వెంటనే ఆంధ్రాకు రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రత డీజీగా కొనసాగుతున్న అంజనీకుమార్, పోలీస్ ట్రైనింగ్ డిజిగా ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తాలను తెలంగాణ ప్రభుత్వం నేడు రిలీవ్ చేసింది.. ఈ ఇద్దరు అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎపిలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించింది.. ఇక ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ మహంతిని రిలీవ్ అంశాన్ని పెండింగ్ లో ఉంచింది.. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా కోడ్ అమలవుతున్నది.. దీంతో ఆయన రిలీవ్ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.. అక్కడి నుంచి సమాధానం వచ్చిన తర్వాత అభిషేక్ రిలీవ్ పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..