టీజీ టెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇన్‌-సర్వీస్‌ టీచర్ల కోసం నిర్వహించిన టీజీ టెట్‌ ఫలితాలను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఫలితాల విడుదలకు సంబంధించి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ నెల 8, 9 తేదీల్లో ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టీజీ టెట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 24 వేల మందికిపైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారి ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.