TG | విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG | విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా


TG, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విద్యార్థులు ధర్నా చేయడం చూసాం.. ఇక్కడ సీన్ రివర్స్.. ఉపాధ్యాయులు ధర్నా చేసారు. అది కూడా ఇంటికి విద్యార్థి ఇంటి ముందు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. విద్యార్థి స్కూలుకు రాలేదని ధర్నా చేసారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం రోజులు నుంచి స్కూల్ కు రావడం లేదు. తల్లిదండ్రులను అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాధమిక స్కూల్ టీచర్లు మిగిలిన విద్యార్ధులతో కలిసి ఆ విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేశారు. సోమవారం నుంచి పిల్లాడిని స్కూల్ కు పంపుతామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Leave a Reply