TG | విస్తరిస్తున్న నైరుతి..

  • జూన్‌ రెండోవారంలో విస్తారంగా వర్షాలు
  • రానున్న నాలుగు రోజులు పలు జిల్లాల్లో వానలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. రుతుపవనాల రాకతో జూన్‌ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనావేసింది.

రుతుపవనాలు విస్తరిస్తుండటంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని చెప్పింది.

జూన్‌ ఒకటిన నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.

జూన్‌ 2న జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్క ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. అలాగే, జూన్ 3-4 తేదీల్లోనూ తెలంగాణ తెలంగాణ జిల్లాలతో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది.

Leave a Reply