హైదరాబాద్ – తెలంగాణలో బిజెపిని అడుగుపెట్టనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి రఘనందన్ స్పందించారు. ఇప్పటికే తాము తెలంగాణలో అడుగుపెట్టామని, ఇక మిగిలింది తమర్ని సాగనంపడమేనని అన్నారు.. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే ఎనిమిది ఎంపి స్థానాలలో,ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో పాగా వేశామన్నారు.. ఎంపి ఎన్నికలలో రేవంత్ స్వంత జిల్లా మహబూబ్ నగర్ సీటును, రేవంత్ ఇన్ ఛార్జీగా వ్యవహరించిన చేవేళ్ల స్థానాన్ని, గతంలో రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజీగిరి లోక్ సభ సీటు కూడా బిజెపి కైవసం చేసుకుందని గుర్తు చేశారు.. సాక్షాత్తు బిఆర్ఎస్ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కామారెడ్డిలో సాగనంపింది తామేనని అన్నారు. ఇక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ ఆఖరి ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని జోస్యం చెప్పారు.
TG | ఇప్పటికే తెలంగాణలో అడుగుపెట్టాం …నిన్ను సాగనంపడమే మిగిలింది : రేవంత్ కు బిజెపి కౌంటర్
