హైదరాబాద్ : జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే.. తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలివి లేని దద్దమ్మను గద్దెనెక్కిస్తారు.. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తారు.. కోట్లాది మంది జీవితాలతో చెలగాటమాడతారు అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ట్విట్ చేశారు..
కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్థిక వృద్దిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాన్ని పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిదన్ననారు. టూరిస్టు పార్టీలను నమ్మితే జరిగే విధ్వంసమిదని పేర్కొన్నారు.. విజన్ లేనోళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే జరిగే వినాశనమిదని వివరించారు. నాటి పదేళ్ల దార్శనిక పాలనకు.. నేటి దగుల్బాజీ విధానాలకు మధ్య తేడాను నాలుగు కోట్ల సమాజం నిశితంగా గమనిస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు..