హైదరాబాద్ మెడికల్ హబ్‌గా (Medical Hub ) రూపొందడం చాలా సంతోషకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao ) అన్నారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని.. ఇక్కడ ఉండే ఇన్‌ఫ్రా (Infra ) కావచ్చు, డాక్టర్ (doctors ) కావచ్చని తెలిపారు. నేడు ఒక ప్రైవేటు టీవీ నిర్వహించిన డాక్టర్స్‌అవార్డు ప్రదానోత్సవ (awards ) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, డాక్టర్స్‌కు ఇంత మంచి అవార్డులను అందిస్తున్న టీవీ యాజమాన్యానికి, వారి బృందానికి తన అభినందనలు తెలిపారు.
చాలా వృత్తులు చాలా బిజినెస్‌లు ఉంటాయని,. కానీ డాక్టర్‌కు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. వైద్యో నారాయణో హరి అని అంటారని.. తల్లి జన్మనిస్తే ఒక ఆపదలో ఉన్న పేషెంట్ కు పునర్జన్మని ఇచ్చేది డాక్టర్ అని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న డాక్టర్లకు మరింత బాధ్యతగా సేవలు చేసే విధంగా, కొత్తవారిని సేవలు చేసే విధంగా ఈ అవార్డులు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.