TG | చెట్లకు డిజిటల్ ఆధార్‌ – ముఖ్రా కె స‌ర్పంచ్ మీనాక్షికి మాజీ ఎంపి సంతోష్ కుమార్ ప్రశంసలు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని చెప్ప‌డ‌మే కానీ, అందుకు త‌గిన విధంగా కృషి చేసే వారు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్రా కె స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త‌బాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’ తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. అవి వృద్ధి, ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడమే కాకుండా జవాబుదారీతనం, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయి. నిజమైన నాయకత్వం, పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామ‌ని బీఆర్ఎస్ నేత, ప్ర‌కృతి ప్రేమికుడు సంతోష్ కుమార్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు. ఇందుకు ఆమెను అభినందించారు.

https://twitter.com/SantoshKumarBRS/status/1894299330460487908

Leave a Reply