డాక్టర్ కవితా రెడ్డిని సన్మానించిన రెడ్డి సంక్షేమ సంఘం

డాక్టర్ కవితా రెడ్డిని సన్మానించిన రెడ్డి సంక్షేమ సంఘం
నిజామాబాద్ అర్బన్ , ఆంధ్రప్రభ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐ హెచ్ ఎఫ్ డబ్ల్యూ ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కవితా రెడ్డిని రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 369 రెడ్డి సంక్షేమ సంఘం నిజామాబాద్ అధ్యక్షుడు గాదరి సంజీవ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మోతే నవీన్ రెడ్డి,కోశాధికారి అరికెల శ్రీకాంత్ రెడ్డి,కార్యవర్గ సభ్యుడు వినోద్ రెడ్డి,సలహాదారులు నాగిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ కవితా రెడ్డి మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ,ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
