రాష్ట్ర బడ్జెట్ ఉత్తిత్తి బడ్జెట్..

రాష్ట్ర బడ్జెట్ ఉత్తిత్తి బడ్జెట్..

బీసీలకు ఇచ్చిన 60 హామీలు ఏమయ్యాయి
ఉప ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడుతున్నారు
420 హామీలు 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏది
బడ్జెట్ పై పునః పరిశీలన చేయాలి
టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కానీ శ్రీనివాస్ యాదవ్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉత్తిత్తి బడ్జెట్ అని, మోసపూరితమైన , అవాస్తవాల బడ్జెట్ అని టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కానీ శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు .సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైకాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు .కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీలు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాగితం దొరకడం లేదని ఆయన అపహాస్యం చేశారు .ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అవాస్తవాలు తప్పుల తడక బడ్జెట్ను ప్రవేశపెట్టారని విమర్శించారు.

420 హామీలు, ఆరు గ్యారంటీలు అని ఉత్తిత్తి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీసీలకు 60 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని బీసీ వర్గాలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏ నియోజకవర్గంలో అమలు చేశారు చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు ప్రతి బడ్జెట్లో 20000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు 20వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని వివరించారు .10 లక్షల వడ్డీ లేని రుణాలు, చేతివృత్తులకు సంక్షేమ కార్యక్రమాలు తదితర హామీలను హామీలకే పరిమితమయ్యాయని చెప్పారు.

కులవృత్తులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి దానిని అమలు చేయలేదని కనీసమైన పరికరాలకు కూడా ఇవ్వని పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నదని ధ్వజమెత్తారు .విద్యకు సంబంధించి కెసిఆర్ ప్రభుత్వంలోని నిర్మించిన గురుకులాలు పాఠశాలలు ఉన్నాయని వీరు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటివరకు నిర్మాణాలు కాలేదని ఆయన అన్నారు తెలంగాణ టిఆర్ఎస్ పరిపాలన లో సజావుగా సాగి సాగునీరు తాగునీరు విద్యా అవకాశాలు వచ్చాయని ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చెప్పారు. మాట్లాడితే ప్రశ్నిస్తే ఎదురు దాడి కేసులు జైలు పాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ జిల్లా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కి అవకాశం వచ్చిందని దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేయాలని బీసీలకు అన్యాయం చేయవద్దని ఆయన అన్నారు .ఈ తెలంగాణ బడ్జెట్ పై పునః పరిశీలన చేయాలని వీటిని సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు .ఈ ప్రజా సమస్యలపై బడ్జెట్పై అసెంబ్లీలో ఎండగడతామని బీసీ నాయకులైన మేము రాబోయే కాలంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలను చేపట్టి కెసిఆర్ అధికారంలో వచ్చేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేస్తామని బైకాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కిరణ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు ,కౌన్సిలర్ అర్జునయ్య, గంగారం సర్పంచ్ గట్టు ముదిరాజ్ ఎంగంపల్లి ఉప సర్పంచ్ సత్యం ,మాజీ సర్పంచ్ హనుమంతు, మాజీ సర్పంచ్ రాములు ,జానకి రాములు, సత్యం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply